పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పుడు ఆ దిశగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ప్రఖ్యాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘డ్రాగన్’ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రంలో కథ, విజువల్స్, స్కేల్ అన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం.

NTR’s ‘డ్రాగన్ :
ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బైటకు వచ్చింది. హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను ఎంపిక చేశారట. ‘సప్త సాగరదాచె లో యేలో సైడ్’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణి, ఇప్పుడు టాలీవుడ్‌లో మెయిన్ స్ట్రీమ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది.
అయితే, ఈ సినిమాకు ఆమె తీసుకున్న పారితోషికం రూ. 2.5 కోట్లు అని టాక్. ఒకరిద్దరు సినిమాల్లో మాత్రమే కనిపించినా, ఆమె టాలెంట్‌కి ప్రశాంత్ నీల్ ఫిదా అయి, డైరెక్ట్ ఎన్టీఆర్ సరసన ఆమెను తీసుకున్నారట. ఈ పారితోషికం ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ అనే చెప్పాలి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్’ సినిమా యాక్షన్, సైన్స్ ఫిక్షన్, ఎమోషన్ కలగలిపిన ఓ భారీ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కావబోతున్నది. ఎన్టీఆర్ పాత్ర ఈసారి ఫుల్ ఫైర్‌లో కనిపించనుందని టాక్. ఆయనకు సరసన రుక్మిణి వసంత్ నటించడం ఒక కొత్త ఫ్రెష్ జోడీగా మారబోతోంది.ఈ కాంబినేషన్ గురించి అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రుక్మిణి అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం.
ఇక ఈ సినిమాతో రుక్మిణి టాలీవుడ్‌లో తన స్థానాన్ని ముద్రించగలదా? అన్నదే ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. ప్రశాంత్ నీల్ మేకింగ్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, రుక్మిణి ఫ్రెష్ లుక్… ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దుమ్ము రేపనుందని చెప్పవచ్చు!
2 thoughts on ““NTR’s ‘డ్రాగన్’ లో కన్నడ బ్యూటీ రాకింగ్ ఎంట్రీ… పారితోషికం విని షాక్ అవుతారు!””