
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో హై అంచనాలు కలిగించిన చిత్రం. ఈ సినిమాను ఒక పాలిటికల్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ టైటిల్ తో, అఖిల్ ఫుల్లుగా కొత్త రూట్ లోకి మారినట్టుగా తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ముందుగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయినట్టు టాక్. కానీ, ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినందున, ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రాలేకపోయినా, ఇండస్ట్రీలో ఈ టాక్ బలంగా వినిపిస్తోంది.శ్రీలీల స్థానాన్ని భర్తీ చేయడానికి చిత్రబృందం భాగ్యశ్రీ బోర్స్ అనే మోడల్ మరియు నటి ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమె తెలుగులో ఇదే తొలి పెద్ద ప్రాజెక్ట్ కావడంతో, ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది.
శ్రీలీల ప్రస్తుతం:

-
ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్ సరసన) :::హరిహర వీరమల్లు అప్డేట్ చుడండి
-
మాస్ జాతర (మాస్ మహారాజ్ రవితేజతో)
-
బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సరసన ఓ సినిమా
ఈ ప్రాజెక్టులు కారణంగా డేట్స్ క్లాష్ అవుతూ ఉండే అవకాశం ఉందనే టాక్ ఉంది.
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులు:
-
“శ్రీలీల లేనిదే ఫీల్ అవుతుంది”
-
“భాగ్యశ్రీ బోర్స్ ఎలా చేయబోతుందో చూద్దాం”
అనే కామెంట్లతో ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
అఖిల్ ‘లెనిన్’ మూవీ మీద ఉన్న అంచనాలు మధ్యలో శ్రీలీల అవుట్ అవ్వడం కొత్త ట్విస్ట్ అయితే, భాగ్యశ్రీ ఎంట్రీ కొత్త ఆసక్తిని తెచ్చింది. ఇదే విషయంలో త్వరలో ఆఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.