Kubera :- తెలుగు తెరపై ఈ మధ్య వచ్చిన సినిమాల్లో అద్వితీయమైన విజయాన్ని అందుకున్న చిత్రం ఏదైనా ఉందంటే, అది ‘Kubera’ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే భాషలతో సంబంధం లేకుండా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.
కింగ్ నాగార్జున మరియు నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ కలిసి నటించిన ఈ చిత్రం, మొదట్లో అందరిలో ఆసక్తిని కలిగించగా, రిలీజ్ తర్వాత మాత్రం పూర్తిగా ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆయన కెరీర్‌లోనే కాకుండా తెలుగు పరిశ్రమలో కూడా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా తన ఫ్రెష్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్ విలన్ జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించి కథకు ఇంటెన్సిటీ అందించాడు. ప్రతి పాత్రలోనూ ఒక విలక్షణత కనిపించడంతో పాటు, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మాత్రం సినిమాలోని భావోద్వేగాలకు మెడింపు గానే నిలిచింది.
ఈ సినిమాకు సంబంధించిన విజయ గాధ చూస్తే, ఇది కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు – కథ, నటన, సంగీతం, టెక్నికల్ పార్ట్స్ అన్నింటినీ కలిపిన కళాత్మక విజయం కూడా అని cine critics అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
2 thoughts on “Kubera 100 కోట్ల Magical Blockbuster: ధనుష్ సినిమా విజయం మిమ్మల్ని మంత్ర ముగ్దులను చేస్తుంది…!”