hit3 ప్రబంజన్:
కోర్ట్’ సినిమా బాలేకపోతే నా ‘హిట్ 3’ సినిమా చూడొద్దు.. ‘హిట్ 3’ సినిమా బాలేకపోతే SSMB మూవీ చూడొద్దు. రాజమౌళిని పక్కన పెట్టుకుని మరీ.. నాని ఈ మాట అనే ధైర్యం చేశారంటే ‘హిట్’పై ఎంత నమ్మకం లేకపోతే ఆ స్టేట్మెంట్ ఇస్తాడు. నేడు ఆ నమ్మకం నిజం అయ్యిందో లేదో ‘హిట్ 3’ సమీక్షలో చూద్దాం.
‘నరికెయ్.. నా కొడుకుని ముక్క ముక్కలకింద నరుకు’.. ఈ మాట థియేటర్స్‌లో ఆడియన్స్ నోట వచ్చిందంటే ఎమోషన్స్‌కి అంత గట్టిగా కనెక్ట్ అయ్యాడని అర్థం. ‘ఆడదానిపై చేయి వేస్తే నరకాల్సింది చేయి కాదు.. తలా’ అంటూ ప్రభాస్ విలన్ తలని ఎగరేసి నరికితే జనం విజిల్స్ వేశారు. ‘ఒక్కొక్కర్నీ కాదు షేర్ ఖాన్ వందమందినీ ఒకేసారి రమ్మను’ అని రామ్ చరణ్ రక్తపాతం సృష్టిస్తుంటే జనం జై కొట్టారు. ‘బిడ్డమీద ఒక్క చిన్న గీత పడాలా.. గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా’ అని పుష్ప రాజ్ ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా నరుకుతుంటే జనం పూనకంతో ఊగిపోయారు. ‘తొంగి తొంగి.. నక్కి నక్కి గాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే’ అని ఎన్టీఆర్ నరమేధం సృష్టిస్తుంటే ప్రేక్షకుల నరాలు ఒప్పొంగాయి. ఇలా బలమైన భావోద్వేగాలు రగిలినప్పుడు.. రక్తపాతం ఏరులైపారినా ప్రేక్షకులకు పెద్దగా పట్టింపు ఉండదు. కానీ.. హిట్ 3లో ఎమోషన్స్ కంటే సైకో కిల్లర్స్ ఏరివేతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నరమేధం సృష్టించాడు నాని.
నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణంలో వచ్చిన ‘హిట్’ ఫ్రాంచైజీలోని గత చిత్రాలు ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఒక హత్య కేసును చాలా తెలివిగా ఛేదించగలిగే పోలీస్ ఆఫీసర్స్‌గా కనిపించారు హిట్, హిట్ 2 చిత్రాల్లోని అడవి శేష్, విశ్వక్ సేన్లు. అయితే హిట్ 3తో సొంత ఫ్రాంచైజీలో నిర్మాతగా కాకుండా ఈసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని.. ఈ మూడోకేసు మాత్రం గత చిత్రాల మాదిరిగా ఉండదని ముందు నుంచీ చెప్తూనే ఉన్నాడు. అన్నివర్గాల ప్రేక్షకుల్నీ ఆదరించే చిత్రాలు కొన్నైతే.. టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పించే చిత్రాలు కొన్ని ఉంటాయి. హిట్ 3 టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పించే చిత్రం అని ముందు నుంచీ చెప్పిన నాని.. ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ కేవలం తన టార్గెట్ ఆడియన్స్ కోసమే ఈ మూడో కేసుని హింసాత్మకంగా ఛేదించాడు.
CTK (క్యాప్చర్ టార్చర్ కిల్లింగ్) అనే సైకో కిల్లర్స్ గ్యాంగ్‌ని అంతమొందించడానికి ఎస్పీ అర్జున్ సర్కార్ (నాని -Nani) సృష్టించిన మారణహోమమే హిట్ 3. హిట్ టీంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ సర్కార్.. అతి కిరాతకంగా రెండు సీరియల్ మర్డర్స్ చేస్తాడు. ఆ రెండు మర్డర్స్ కూడా ఒకే తరహాలో ఒకే విధంగా చేసి.. దాన్ని రికార్డ్ చేసి.. డార్క్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తాడు. ఏక కాలంటో దేశ వ్యాప్తంగా ఇలాంటి సీరియల్ సైకో మర్డర్స్ చాలానే జరుగుతుంటాయి. ఆ హత్యలకి అర్జున్ సర్కార్‌కి లింకేంటి? అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఆ కేసుని అర్జున్ సర్కార్ ఏవిధంగా ఛేదించాడు? అతను అంత క్రూరంగా మారడానికి కారణం ఏంటనేదే ‘హిట్ 3’ అసలు కథ.
అన్యాయంపై హీరో తిరుగుబాటు.. వృత్తిపరమైన ఆధిపత్యం.. ప్రతి రివేంజ్ కథలోని కామన్ పాయింటే. కానీ అదే కథలో ఊహాతీతమైన ట్రిగ్గర్ పాయింట్ ఉంటే.. బలమైన సన్నివేషాలు.. పదునైన సంభాషణలతో పరుగులు పెట్టే కథనం తోడైతే ఆ కథకి తిరుగు ఉండదు. దర్శకుడు శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో గత రెండు చిత్రాలను ఇదే తరహాలో రూపొందించి.. హిట్ 3కి మోస్ట్ వయొలెన్స్‌ని అనే డిఫరెంట్ ట్రీట్మెంట్ జోడించారు. సస్పెన్స్ థ్రిల్లర్, ఇన్విస్టిగేషన్ దగ్గరే ఆగిపోకుండా.. CTK అనే సైకో ప్రపంచాన్ని సృష్టించాడు. ‘ఆపదలో ఉన్న వాళ్లను రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు’ అంటూ చాగంటితో ప్రవచనాలు చెప్పిస్తూ.. హీరోతో ఊచకోత కోయించాడు.
అర్జున్ సర్కార్
అర్జున్ సర్కార్ చేసిన నేరంతో కథ మొదలౌతుంది. అది నేరమా? లేదంటే నేరం చేసిన వాళ్లకి విధించే శిక్షా? అన్న కథాగమనంలో ట్విస్ట్‌లు.. ట్రిగ్గర్ పాయింట్లు చాలానే ఉన్నాయి. అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నానిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు దర్శకుడు. పగ, ప్రతీకారం కథకి రిలేటబుల్‌గా డీల్ చేస్తూ.. కేసుకి సంబంధించిన ఇంటెన్సిటీ.. ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. కానీ.. ఎంత సైకో గ్యాంగ్ అయినా వాళ్లని అంతం చేయడానికి హీరో కూడా సైకోలని మించిన సైకోగా మారాలనే పాయింట్ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎలివేషన్స్ కోసం హింసను ప్రేరేపించే సినిమాలకంటే.. కథే హింసను కోరుకునే సినిమాలనే జనం ఆదరిస్తుంటారు. హిట్ 3 ఈ రెండింటికి మధ్యలోనే ఆగిపోయింది. అర్జున్ సర్కార్ ఎందుకంత క్రూరమైన వ్యక్తిగా మారాడు అనేదానికి బలమైన కోర్ ఎమోషన్ కనిపించదు.
చిన్నపిల్లలు.. సున్నిత మనస్కులు ఈ సినిమాకి దూరంగా ఉండమని ముందే చెప్పిన నాని.. ఈ సినిమాలో కేవలం చిన్నపిల్లలు.. సున్నిత మనస్కులనే కాదు.. కామన్ ఆడియన్స్‌ని చాలాసార్లు కళ్లు మూసుకునేట్టు చేశాడు. అంత దారుణంగా రక్తపాతం సృష్టించేశాడు. హీరో దేని కోసం ఈ మారణహోమం చేస్తున్నాడనే పాయింట్‌ని ఫస్టాఫ్ ముగింపు వరకూ రివీల్ చేయలేదు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ ఉంటుందని బోలెడన్ని ఆశలతో ఉంటే.. దీనికోసమేనా ఇంత మారణహోమం అనేట్టుగా సింపుల్‌గా తేల్చేశారు. మర్డర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథల్లో హీరో ఎత్తులకు పైఎత్తులు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ హిట్ 3లో హీరో కేవలం కండబలంతోనే పరిస్థితుల్ని తనకి అనుకూలంగా మార్చేసుకోవడం.. సస్పెన్స్ థ్రిల్లర్స్‌లో కనిపించే మజా ఇక్కడ మిస్ అవుతుంది.
150 మంది సైకో కిల్లర్స్‌ని ఊచకోత కోయడం.. వాళ్లు తిరిగి నరికినా.. చంపినా లేచి వచ్చేయడం.. శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడిచినా హీరో విజృంభించి తనకేదో ఊహాతీతమైన శక్తులు ఉన్నట్టుగా ఫైట్లు చేసేయడం లాంటివి వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. కథానాయకుడ్ని వీర యోధుడిలా చూపిస్తున్నప్పుడు.. ప్రతి నాయకుడు కూడా అంతే బలంగా ఉండాలి.. కానీ హిట్ 3లో అది లోపించింది. హిట్ ఫ్రాంచైజీలోని గత రెండు చిత్రాల్లో కేసు ఇన్వెస్టిగేషన్ కీ రోల్ కాగా.. హిట్ 3లో హింసకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. పీకల్ని ఉల్లిపాయలు తరిగినట్టు తరిగేయడం.. కాళ్లు చేతుల్ని కసకసా కోసేయడం.. రక్తం కల్లాపు చల్లినట్టు చల్లేయడం లాంటివి అమ్మ బాబోయ్ ఇది మలయాళం ‘మార్కో’ మూవీకి అమ్మ మొగుడులా ఉందే అనిపిస్తుంది చాలా సీన్లతో. అంత భయంకరంగా.. కర్కశంగా ఉంటాయి సీన్లు..
ఊపిరిసలపని వయెలెన్స్లో రిలీఫ్ అంటే.. హీరో నాని క్యారెక్టరైజేషన్. అర్జున్ సర్కార్‌గా నిజంగానే సర్కార్ అనేట్టుగా నటించాడు. జెర్సీ, దసరా, హాయ్ నాన్న, హిట్ 3 ఇలా సినిమా సినిమాకి డిఫరెంట్ కథల్ని ఎంచుకుంటూ.. కథకి తగ్గ కథానాయకుడిగా మారిపోతున్నారు నేచురల్ స్టార్ నాని. ఇష్టం లేకపోతే కష్టం కానీ.. పాత్రని ఆస్వాదిస్తే పనిచేస్తే తిరుగుఉండదనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నాని అర్జున్ సర్కార్ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. ఏయ్.. అని అతను అరిచే అరుపు నిజంగానే భయపెట్టింది. నెంబర్ గేమ్స్‌కి కాస్త దూరంగా ఉన్నా స్టార్ హీరోలతో ధీటుగా సినిమాలు చేస్తున్న నాని.. ఎప్పుడో స్టార్ హీరో అనిపించుకున్నారు. అయితే మన టాలీవుడ్ బడా స్టార్లంతా స్టార్ డైరెక్టర్స్‌తో సేఫ్‌గా నెంబర్ గేమ్ ఆడుతుంటే నాని మాత్రం థింక్ డిఫరెంట్ అన్నట్టుగా యంగ్ డైరెక్టర్స్‌తో పాన్ ఇండియా రేంజ్లో తలపడుతున్నాడు. ఇది గొప్ప విషయం.. గట్స్ ఉన్న విషయం.
అర్జున్ సర్కార్‌గా తనలోని మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్‌కి గట్టిగానే పదునుపెట్టాడు నాని. దెం** .. దెం **.. అంటూ నాని చాలాసార్లు బూతుల్ని మింగేసినా.. ఆ సౌండ్ మాత్రం థియేటర్స్‌లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అర్జున్ సర్కార్‌గా తన క్యారెక్టర్‌కి లిమిటేషన్ ఉండదు అనేట్టుగానే జీవించేశాడు నాని.
నాని~శ్రీనిధి కెమిస్ట్రీ మాములుగా లేదు….వాఆ:-

నాని-శ్రీనిధిల మధ్య లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్ బాగా పండాయి. ‘అమ్మ దగ్గర పెరగలేదు కదా.. నీకు ఓకే అయితే అమ్మ ప్రేమ నేర్పిస్తాను’ అంటూ హీరోయిన్ ప్రపోజ్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. ట్రైన్లో వీళ్లిద్దర్నీ కలిపే లిప్ లాక్ సీన్‌కి యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. హిట్ 2 హీరో అడవి శేష్.. ఎంట్రీ సర్ ప్రైజ్‌గా అనిపిస్తుంది కానీ.. కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. క్లైమాక్స్‌లో వచ్చి విలన్ల ఏరివేత కార్యక్రమంలో భాగం అయ్యాడంతే. ఇక హిట్ సీక్వెన్స్‌లో నాలుగో కేసు ఉండబోతుందని ఏసీపీ వీరప్పన్‌గా కార్తిని చూపించారు. ఈ హిట్ 3కి కార్తీకి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ కామియో రోల్‌కి మాత్రమే పరిమితం అయ్యారు కార్తి. పోలీస్ అధికారులుగా.. రావు రమేష్, చైతన్య జొన్నలగడ్డ ఇంపార్టెన్స్ రోల్స్‌లో కనిపించారు. నానికి తండ్రిగా సముద్రఖని బాగానే సూటయ్యారు కానీ.. ఆ క్యారెక్టర్‌కి పెద్దగా ప్రాధాన్యత లేదు. కొడుకు గదిలో పోర్న్ చూస్తుంటే.. తలుపులేసుకుని కొట్టుకో అని ఆయన నోటా ద్వంద్వార్థాలు పలికించారు.
షాన్ వర్గీస్.. సినిమాటోగ్రాఫర్ విజువల్స్ గ్రాండ్‌గా ఉండటమే కాదు.. తన విజువలైజేషన్‌తో కథ చెప్పే విధంగా సన్నివేషాలను చిత్రీకరించారు. మిక్కీ జె మేయర్ తొలిసారిగా క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి సంగీతం అందించడం ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ఇప్పటివరకూ ఫీల్ గుడ్ మూవీస్‌కి మ్యూజిక్ అందించిన మిక్కీ జె మేయర్.. థ్రిల్లర్ కథకి అందించిన సౌండ్ కొత్తగా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా అలరించింది.. ఇంకొన్ని చోట్ల భయపెట్టింది. ముఖ్యంగా నాని క్యారెక్టరైజేషన్‌ని మిక్కీ జె మేయర్ ఆర్ ఆర్తో బాగా ఎలివేట్ చేశారు. చివరి 30 నిమిషాలు వాయించిపారేశారు.
ఓవరాల్‌గా.. ‘హిట్ 3’ మూడో కేసు గత రెండు కేసుల్నిమించి అయితే లేదు. నాని కోసం అయితే ఓసారి చూడొచ్చు. బట్.. హింసని తట్టుకునేవాళ్లకి మాత్రమే. చిన్న పిల్లల్ని మాత్రం ఈ ‘హింస’కి దూరంగా ఉంచడం మంచిది..
ఈగ పాటలు కాడికి వస్తాయ్ …రొమాంటిక్ మెలోడీస్:-
- ప్రేమ వెల్లువ
- అబ్కీ బార్ అర్జున్ సర్కార్
- థాను
- పోరాటమే
కలిసొచ్చిన శనివారం.. హిట్ 3కి భారీ కలెక్షన్స్.. నాని మూవీకి ఎన్ని కోట్లంటే ?
హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
థియేట్రికల్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్లు కింద ఇండియాలో ఈ సినిమా రూ.38.5 కోట్ల వ్యాపారం చేసింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు కలిపి మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇండియాలో 9 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల నెట్, 8వ రోజున రూ.2.1 కోట్ల నెట్, 9వ రోజున రూ.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదో రోజున రూ.2.03 కోట్ల నెట్, తొమ్మిదో రోజున రూ.1.83 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 62 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని.
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళంలో రూ.కోటి 36 లక్షల నెట్, కన్నడంలో 32 లక్షల రూపాయల నెట్, హిందీలో కోటి 70 లక్షల రూపాయల నెట్, మలయాళంలో 70 లక్షల రూపాయలు ఆర్జించింది హిట్ చిత్రం.
ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్ కలెక్షన్స్ హిట్ 3 సినిమాకు ప్లస్‌గా మారాయి. హిట్ 3 రూ.100 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరడానికి ఓవర్సీస్ వసూళ్లు కారణమయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.24 కోట్ల వసూళ్లను సాధించింది
హిట్ 3 పదో రోజు వసూళ్లు ఎంతంటే?
10వ రోజు శనివారం వీకెండ్ కావడంతో హిట్ 3కి బాగానే బుకింగ్స్ జరిగాయి. 23.23 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ అందుకున్నట్లు సాక్నిల్క్ తెలిపింది. శనివారం హైదరాబాద్‌లో 373, బెంగళూరులో 286, విజయవాడలో 72, విశాఖపట్నంలో 108 షోలు పడ్డాయి. పదో రోజు ఈ హిట్ చిత్రం ఇండియాలో రూ.2.50 కోట్ల నికర వసూళ్లను సాధించింది. తద్వారా 10 రోజుల వరకు నాని సినిమా ఇండియాలో రూ.68.22 కోట్ల నెట్.. రూ.77.04 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్ వసూళ్లు రూ.24 కోట్లు కలిపి హిట్ 3 సినిమా 10 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.101 కోట్లు ఆర్జించినట్లు సాక్నిల్క్ వెల్లడించింది. ఆదివారం కూడా నాని చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తాయని చిత్ర యూనిట్ ఎదురుచూస్తోంది. మరి అర్జున్ సర్కార్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.
. ✦ఏసీపీ వీరప్పన్ ఆన్ డ్యూటీ.. ‘హిట్ 4’ హీరోగా కార్తి.. థియేటర్స్‌లో అరుపులే
1 thought on “hit3 మూవీ రివ్యూ…100 కోట్లూ పైనై..”