
Coolie : The Power House :
సూపర్ స్టార్ రజినీకాంత్… ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, థియేటర్లు కదలాల్సిందే. ఇప్పుడు ఆయన మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై తన మాస్ స్వాగ్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే, ఈసారి టైటిల్ విషయంలో యూనిట్ చేసిన సాహసం హాట్ టాపిక్ అయ్యింది.ప్రారంభంలో ‘మజ్దురు’ అనే పేరుతో ప్రకటించిన ఈ సినిమాకి… ఇప్పుడు ‘Coolie: The Power House’ అనే కొత్త టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మార్పు వెనుక ఉన్న కారణం… ఫాన్స్ స్పందన… లోకేష్ కానగరాజ్ మాస్టర్ ప్లాన్… ఇవన్నీ ఒకేసారి తెలుసుకుందాం.తను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో కొత్త యాక్షన్, డార్క షేడ్ ఉండాలనే స్టైల్‌ను కొనసాగిస్తున్న లోకేష్ కనగరాజ్ – ఈసారి రజినీకాంత్‌తో కలిసి పనిచేస్తున్నాడు.కైది, మాస్టర్, విక్రమ్ వంటి హిట్ చిత్రాల తర్వాత రజినీతో “Coolie” చేయడం అంటే అదృష్టంగా భావిస్తున్నాడు లోకేష్.ఇది సాధారణ సినిమా కాదు – పాలిటికల్ బ్యాక్‌డ్రాప్, ఎమోషనల్ డ్రామా, మాస్ యాక్షన్, థ్రిల్లింగ్ ఫ్లాష్‌బ్యాక్ – అన్నీ కలిపిన బ్లాక్‌బస్టర్ ప్యాకేజ్!
ఈ సినిమాలో ప్రధాన విలన్‌గా నాగార్జున కనిపించనున్నాడన్న టాక్ ఉంది. అలాగే ఉపేంద్ర మరియు అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించనున్నారని సమాచారం.ఇది సౌత్ & నార్త్ కలయిక అని చెప్పొచ్చు – ఫుల్ ఇండియా వైడ్ రిలీజ్ కోసం ఇది పెద్ద ప్లాన్.ఈ మూవీని ఆగస్టు 14, 2025న విడుదల చేయనున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ కావడంతో సినిమా మాస్ రీచ్‌ను మళ్ళీ పిక్‌లోకి తీసుకెళ్లే అవకాశముంది.


రజినీకాంత్ ‘కూలీ ‘ సినిమా టైటిల్ ను మార్చినట్లు సినిమా యూనిట్ అధికారంగా ప్రకటిచింది . తొలుత ‘మజ్దురు’ అనే టైటిల్ ను ప్రకటిచించగా , అందులో మాస్ ఆపిల్ లేదని ఫాన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో నిర్మాతలు టైటిల్ మార్చారు . లోకేష్ కానగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగష్టు 14న రిలీజ్ కానుంది . నాగార్జున , ఉపేంద్ర , అమిర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు .
1 thought on “Coolie: The Power Houseగా మారనున్న రజిని ‘కూలీ’ సినిమా …!”