
BIGG BOSS SEASON 9
తెలుగు బిగ్ బాస్ అభిమానులకు మళ్లీ ఎగ్జైటింగ్ టైం వచ్చింది! ఇప్పటికే 8 సీజన్లు పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ రియాలిటీ షో, ఇప్పుడు సీజన్ 9 తో మళ్లీ రాబోతోంది. తాజాగా మేకర్స్ ప్రొమోషన్లను స్టార్ట్ చేయడంతో పాటు, ఈసారి ఓ కొత్త ట్విస్ట్ అందిస్తున్నారు.
సాధారణ ప్రేక్షకులకే ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది బిగ్ బాస్ టీం – మీరు కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొనవచ్చు. www.bb9.jiostar.com అనే వెబ్సైట్ ద్వారా మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్‌లోకి రావాలనుకుంటున్నారు అన్నదాన్ని ఓ క్రియేటివ్ వీడియో రూపంలో తయారుచేసి అప్లోడ్ చేయాలి. ఆ వీడియో ద్వారా మీ వ్యక్తిత్వాన్ని, uniqueness ను చూపించగలిగితే – ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం మీకే!
ఇది ఇప్పటివరకు వచ్చిన సీజన్లలో లేని ప్రత్యేకత. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్‌కి ఉన్న followingలతో పాటు – ఇప్పుడు కామన్ పీపుల్‌కి కూడా ఛాన్స్ అంటే ఇది ఓ బ్రేక్ ద ఛాన్స్ లాంటిది. అతి త్వరలోనే ప్రోమోలో హోస్ట్ వివరాలు కూడా బయటకురానున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
1 thought on “BIGG BOSS : బిగ్ బాస్ 9 ప్రారంభం… ఈసారి మీరు కూడా హౌస్‌లో అడుగు పెట్టొచ్చు! Here’s How!”