మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘విశ్వంభర’ పై ప్రేక్షకుల్లో అంచనాలు నిత్యం పెరిగిపోతున్నాయి. శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ విజువల్ ఎక్స్‌ట్రావగాంజా గురించి దర్శకుడు తాజా ఇంటర్వ్యూలో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే —
“ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అందరికీ గ్రాండ్‌గా చూపించాలనే లక్ష్యంతో వరల్డ్ టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. మొత్తం 4,676 VFX షాట్స్ ఉన్నాయ్. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు.” అని తెలిపారు.

టెక్నికల్‌గా హై స్టాండర్డ్ మూవీ!
‘విశ్వంభర’ సినిమా పై ప్రత్యేకమైన ఆసక్తి వున్నదంటే, ఆ క్రేజుకి ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్. ఈ స్థాయిలో భారీ విజువల్ ఫీస్టును అందించడానికి, చిత్రబృందం గ్లోబల్ లెవెల్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. టాలీవుడ్‌లో ఈ స్థాయిలో ఉన్న సినిమాలు అరుదుగా ఉంటాయి. వశిష్ఠ క్రియేటివ్ విజన్‌తో మెగాస్టార్ పవర్ మిళితమైతే, ప్రేక్షకులకు ఇది ఒక విజువల్ మాస్టర్ పీస్ అవుతుంది అని స్పష్టమవుతుంది.
రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ఇంతవరకు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు కానీ, పోస్టు ప్రొడక్షన్ పూర్తైన వెంటనే గ్రాండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్టు దర్శకుడు స్పష్టం చేశారు. ‘విశ్వంభర’ ను పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
చిరంజీవి కొత్త లుక్ – సరికొత్త పౌరాణిక గాథ :
చిరంజీవి ఈ సినిమాలో చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారని టాక్. పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా, ప్రేక్షకులను ఒక మాయలోకి తీసుకెళ్లే విధంగా ఉండబోతోంది. ఇంత వరకూ చిరంజీవి కెరీర్‌లో లేని స్పెషల్ రోల్ ఇది అనడంలో అతిశయోక్తి లేదు.