2003లో విడుదలైన ‘దిల్’ మూవీ నితిన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. దిల్ రాజు నిర్మాతగా మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించగా, ఆ చిత్రం తర్వాత ఆయనకి ‘దిల్’ అనే ఇంటిపేరు అయ్యింది. అప్పటినుండి ఈ పేరే ఆయనకు పర్మనెంట్ బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు, దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ నితిన్ – దిల్ రాజు కాంబోలో వస్తున్న సినిమా ‘తమ్ముడు’, జూలై 4న గ్రాండ్ రిలీజ్ కానుంది.

‘దిల్ 2’ వస్తుందా?
దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘దిల్’ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా? అని ప్రశ్నించగా, దిల్ రాజు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
“ఒకే సినిమాలో తండ్రి, కొడుకు పాత్రలు రెండు నితిన్ చేస్తేనే ‘దిల్ 2’ నిర్మిస్తా” అని స్పష్టం చేశారు.
ఇది విన్న ఫ్యాన్స్ ఫుల్ గా ఎగిరి గగనాన్నంటున్నారు. ఇంత కాలం తర్వాత మళ్లీ నితిన్ అదే మాస్ ఎనర్జీతో స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘తమ్ముడు‘ తో మళ్లీ కాంబోలో మెరిసే నితిన్ – దిల్ రాజు

తాజాగా నితిన్ హీరోగా, వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ‘తమ్ముడు’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా నితిన్ – దిల్ రాజు కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామా మిక్స్ తో ‘తమ్ముడు’ చిత్రానికి పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది.
1 thought on “‘దిల్ 2’ వస్తుందా? ..నితిన్ – దిల్ రాజు కాంబోపై ఆసక్తికర వ్యాఖ్యలు..”